సాయికృష్ణ మిస్సింగ్‌ కేసులో కీలక పరిణామం..

ఏపీలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ మిస్సింగ్‌ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు, వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ రంగ ప్రవేశంతో సీన్‌ మారిపోయింది. ప్రభుత్వ యంత్రాంగం దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసుకు సంబంధించి కృష్ణలకం సీఐ నాగరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం రాత్రి 11 గంటల సమయంలో బాధితుడి తల్లికి విజయవాడ సీపీ రాజశేఖర్‌ బాబు బాధితుడి తల్లిని పిలిపించి మాట్లాడారు. ఆమె సీఐపై ఫిర్యాదు చేయగా వెంటనే నాగరాజుపై 127 (4), 127 (6), 103 (1), 238 బీఎన్‌ఎస్‌ సెక్షన్ల కింద నమోదు చేశారు. ఫిర్యాదు కాపీని...