కాజల్ అగర్వాల్ బర్త్‌డేకు బాలయ్య గిఫ్ట్..

నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘NBK111’ నుంచి మేకర్స్ బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. నేడు హీరోయిన్ కాజల్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేస్తూ చిత్రంలో కాజల్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో గత కొన్ని వారాలుగా ఈ ప్రాజెక్ట్‌పై నెలకొన్న ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ పడింది.ఈరోజు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కాజల్ సింపుల్ చీరకట్టులో, కళ్లజోడు ధరించి అత్యంత గంభీరంగా కనిపించింది. కార్యాలయ వాతావరణంలో నిలబడి ఉన్న ఆమె లుక్‌లో సీరియస్‌నెస్, పవర్‌ఫుల్ వైబ్ స్పష్టంగా కనిపిస్తోంది. స్టార్ హీరోయిన్‌ను ఇలా డీ-గ్లామర్ లుక్‌లో చూపించడంతో పాత్రపై...