టీమిండియాకు గుడ్ న్యూస్..
గాయం నుంచి కోలుకున్న యువ ఫాస్ట్ బౌలర్, ఆల్ రౌండర్ హర్షిత్ రాణా అఫ్ఘనిస్తాన్‌తో చెన్నై వేదికగా జరగనున్న మూడో వన్డే కోసం భారత జట్టులో చేరాడు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన టీ20 ప్రపంచ కప్ వార్మప్ మ్యాచ్‌లో రాణా మోకాలికి గాయం కావడంతో అతను మొత్తం టోర్నమెంట్‌తో పాటు 2026 ఐపీఎల్ సీజన్‌కు కూడా దూరమయ్యాడు.బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చికిత్స తీసుకున్న అనంతరం కోలుకొని తిరిగి జట్టుతో కలిశాడు.ఈ సిరీస్‌లో ఇప్పటికే భారత్ 2-0 ఆధిక్యంలో ఉన్నందున రాబోయే ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలను దృష్టిలో ఉంచుకుని హర్షిత్ రాణాకు ఫిట్‌నెస్ నిరూపించుకునే అవకాశం కల్పిస్తున్నారు. మూడో వన్డే కోసం టీమిండియా జట్టు:...