ఇక యమస్పీడ్‌గా రాజధానికి ..

ప్రస్తుతం జిల్లా నుంచి రాజధాని అమరావతి, విజయవాడకు వెళ్లాలంటే రోడ్డు ప్రయాణం భారంగా మారింది. రైళ్ల సౌకర్యమూ అంతంత మాత్రంగానే ఉంది. దీనికి తోడు అమరావతి రాజధాని అయినప్పటి నుంచి పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున విద్యాసంస్థలు వెలిశాయి. గతంలో హైద్రాబాద్‌లో చదవాలనే అలోచన ఉన్నవారంతా.. ప్రస్తుతం విజయవాడ, నూజివీడు పరిసరప్రాంతాల్లోని విద్యాలయాల్లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో ప్రయాణికుల రద్దీ అమాంతంగా పెరిపోయింది. అందుకు తగిన విధంగా సౌకర్యాలు లేకపోవడంతో జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ సమస్యకు చెక్‌ పేట్టేలా ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాయి. బీకేవీ (బెంగళూరు, కదిరి, విజయవాడ) ప్రాజెక్టు ద్వారా మల్లికవేముల క్రాస్‌ వద్ద జంక్షన్‌ ఏర్పాటు...