మహిళల భారత జట్టుకు భారీ ఎదురు దెబ్బ..

ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2026లో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేస్తోంది. తొలి రెండు మ్యాచుల్లో భారీ తేడాతో ప్రత్యర్థి జట్లను చిత్తు చేసింది. తదుపరి మ్యాచుల్లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్లతో తలపడాల్సి ఉంది. ఈ తరుణంలో హర్మన్ ప్రీత్ కౌర్ సేనాకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. టీమిండియా క్రికెటర్ శ్రేయాంక పాటిల్ గాయంతో ఈ టోర్నీకి దూరమైనట్లు బీసీసీఐ తెలిపింది. కాగా ఆమె స్థానంలో అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ ప్రేమా రావత్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ మేరకు శుక్రవారం బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది.టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా బుధ‌వారం(మే 17న) నెద‌ర్లాండ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో...