‘డాన్ 3’ వివాదం నేపథ్యంలో రణ్‌వీర్ సంచలన నిర్ణయం..
బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ ‘డాన్ 3’ వివాదంపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ అంశంపై కనీసం 18 నెలల పాటు ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని, అలాగే ఏ జర్నలిస్టుకు ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. తన తదుపరి చిత్రం ‘ప్రళయ్’ విడుదల అయ్యేవరకు ఈ మౌనం కొనసాగుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఒక బాలీవుడ్ మీడియా రణ్‌వీర్‌ని కలిసిన అనంతరం మాట్లాడుతూ.. మేము రణ్‌వీర్‌ను వ్యక్తిగతంగా కలిశాము. ‘డాన్ 3’ వివాదంపై మాట్లాడనని, కనీసం 18 నెలల పాటు ఇంటర్వ్యూలు ఇవ్వనని ఆయన స్పష్టం చేశారని తెలిపింది.రణ్‌వీర్ సింగ్, ఫర్హాన్ అక్తర్ మధ్య ‘డాన్ 3’ విషయంలో తలెత్తిన విభేదాలు...