‘అమరన్’ ద‌ర్శ‌కుడితో ధనుష్ కొత్త మూవీ..

తమిళ స్టార్ న‌టుడు ధనుష్ 55వ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. D55గా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి ‘OM’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ, మేకర్స్ పేరుతో అదిరిపోయే గ్లింప్స్‌ను విడుదల చేశారు. దట్టమైన అడవులు, కొండల నడుమ సాగే ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా ఈ గ్లింప్స్ కట్ చేశారు. అమాయక గిరిజనులను సాయుధ బలగాలు చుట్టుముట్టగా, భయంతో ఉన్న వారంతా ఒక్కసారిగా “అణ్ణా మలైయార్‌కు!” అని నినదించే సీన్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ఆ వెంటనే వర్షం, పొగమంచు మధ్య చేతిలో తుపాకితో ధనుష్ వయలెంట్ అవతారంలో ఎంట్రీ ఇస్తాడు. తుపాకులు పట్టుకున్న బలగాలతో ఒంటిచేత్తో తలపడే యాక్షన్...