క్షుద్రపూజల అనుమానం..

దేశ రాజధాని ఢిల్లీలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. క్షుద్ర పూజలు చేస్తోందన్న అనుమానంతో ఓ డాక్టర్ తన ఇంటి పని మనిషిని చంపేశాడు. క్రికెట్ బ్యాట్‌తో కొట్టి.. కత్తితో పొడిచి ప్రాణాలు తీసేశాడు. గురువారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మౌంట్ కైలాశ్ ఏరియాకు చెందిన మనీశ్ గుప్తా డెర్మటాలజిస్టుగా సేవలందిస్తున్నాడు. మనీశ్ ఇంట్లో గత 15 ఏళ్ల నుంచి మీనా అనే మహిళ పని చేస్తోంది. మీనా క్షుద్ర పూజలు చేస్తోందని మనీశ్‌కు అనుమానం కలిగింది. ఆమె కారణంగా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వ్యాపిస్తోందని భావించాడు. ఆయుర్వేదిక్ ప్రాక్టిషనర్ అయిన తన భార్యతో.. మీనాను ఉద్యోగం నుంచి తీసేయమని...