ఎర్రబెల్లి ప్రదీప్ రావు జన్మదినం సందర్భంగా మహా ఉచిత కంటి వైద్య శిబిరం

వరంగల్, జూన్ 19 (సుదీక్ష న్యూస్): ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కాశీబుగ్గ KVS ప్రాంతంలో శంకర్ కంటి హాస్పిటల్ సహకారంతో ఎర్రబెల్లి ప్రదీప్ రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహా ఉచిత కంటి వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. సుమారు 2,000 మంది పేద, మధ్యతరగతి ప్రజలు పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. నిపుణులైన వైద్యుల బృందం రోగులను పరీక్షించి, అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలు అందించడంతో పాటు తదుపరి చికిత్సపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి వినీత్ రావు మాట్లాడుతూ, ప్రజలకు ఉపయోగపడే...