రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ – 2 వేల మందికి మహా అన్నదానం
వరంగల్, జూన్ 19 (సుదీక్ష న్యూస్): కొండా దంపతుల ఆదేశానుసారం, వారి నాయకత్వంలో ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు శ్రీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను వరంగల్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు గోపాల నవీన్ రాజ్ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి సుమారు 2 వేల మందికి మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గోపాల నవీన్ రాజ్ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ గాంధీ కుటుంబం దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన కుటుంబమని కొనియాడారు. శ్రీ రాహుల్ గాంధీ భవిష్యత్తులో భారత ప్రధానమంత్రి కావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు....