రోటరీ క్లబ్ వరంగల్ ఆధ్వర్యంలో ఏవీవీ విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ
వరంగల్, జూన్ 19 (సుదీక్ష న్యూస్): స్థానిక ఏవీవీ ఉన్నత పాఠశాలలో రోటరీ క్లబ్ వరంగల్ ఆధ్వర్యంలో రూ.25 వేల విలువైన నోటు పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా 300 మంది విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ భుజేందర్ రెడ్డి మాట్లాడుతూ, గత నాలుగు సంవత్సరాలుగా రోటరీ క్లబ్ వరంగల్ పేద విద్యార్థులకు నిలయమైన ఏవీవీ విద్యాసంస్థకు తమ వంతు సహకారాన్ని అందిస్తోందని తెలిపారు. ఈ ఏడాది 300 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు అందించడం ద్వారా వారి విద్యాభ్యాసానికి తోడ్పాటు అందిస్తున్నారని పేర్కొన్నారు. రోటరీ...