పేదల జోలికి వస్తే ఊరుకోం: దాస్యం వినయ్ భాస్కర్

కాజీపేట, జూన్ 19 (సుదీక్ష న్యూస్): పేదలకు అన్యాయం చేసే అభివృద్ధిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని, ఏ వర్గానికీ హాని చేయని అభివృద్ధిని మాత్రం స్వాగతిస్తామని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. కాజీపేట మండల కేంద్రంలోని రైల్వే రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తాను ప్రభుత్వ ఉద్యోగి కుటుంబానికి చెందిన వ్యక్తినని, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు తనకు బాగా తెలుసని చెప్పారు. రైల్వే రిటైర్డ్ ఎంప్లాయిస్ కార్యాలయం ఏర్పాటుకు గతంలో కృషి చేశానని, వివిధ సంఘాలు, అసోసియేషన్లకు కార్యాలయాల ఏర్పాటుకు తన వంతు సహకారం అందించానన్నారు. వైఎస్ఆర్...