మాదక ద్రవ్యాల రవాణాకు సరికొత్త 'స్మార్ట్ డ్రగ్' దందా - 'ఈగల్' నివేదికలో నమ్మలేని నిజాలు
టెక్నాలజీ ప్రపంచాన్ని మార్చేస్తే, అదే టెక్నాలజీని వాడుకుంటూ మత్తు వ్యాపారులు వేస్తున్న మైండ్ బ్లోయింగ్ ఎత్తుగడలు చూసి అటు ఇంటెలిజెన్స్ వర్గాలు, ఇటు పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్నారు. పేరు, అడ్రస్‌కు పొంతన ఉండదు. కేవలం మీ చేతిలో ఉన్న మొబైల్‌లో ఒకే ఒక్క క్లిక్‌తో ఆర్డర్ ఇస్తే చాలు మత్తు పదార్థాలు నేరుగా మీ ఇంటి తలుపు తడుతున్నాయి. ఏకంగా మనం రోజువారీ వాడే క్యాబ్, డెలివరీ అగ్రిగేటర్ సర్వీసులను వాడుకుంటూ సాగుతున్న ఈ సరికొత్త 'స్మార్ట్ డ్రగ్' దందా ఏంటి? ఈ స్మార్ట్ డ్రగ్ నెట్‌వర్క్ వెనుక ఉన్న ఆ అంతర్జాతీయ కింగ్‌పిన్స్ ఎవరు? ఈగల్ అధికారులు నివేదికలో బయటపెట్టిన ఆ నమ్మలేని నిజాలు...