పరీక్షా? లేక యుద్ధమా?.. బెంబేలెత్తుతున్న నీట్‌ విద్యార్థులు

నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీతో దేశ వ్యాప్తంగా అభాసుపాలైన కేంద్రం ఈసారి ఎలాగైనా దానిని పకడ్బందీగా నిర్వహించేందుకు నానా తంటాలు పడుతున్నది. ఈ నెల 21న జరిగే నీట్‌ రీటెస్ట్‌కు విద్యార్థుల ఇబ్బందులను పట్టించుకోకుండా ఏదో యుద్ధానికి చేస్తున్నట్టుగా మోదీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. దీంతో ఈసారి నీట్‌ పునః పరీక్ష ఇటు విద్యార్థులకే కాదు అటు కేంద్రానికి కూడా కఠిన పరీక్షగా మారింది. పరీక్షలో మంచి మార్కులతో మెడిసిన్‌ సీట్‌ కోసం అభ్యర్థులు తపన పడుతుండగా, లోపరహితంగా పరీక్ష నిర్వహించి ప్రభుత్వంపై మరో మచ్చ పడకుండా బయటపడాలని ప్రభుత్వం నానా తంటాలు పడుతున్నది. ఎక్కడ మళ్లీ పేపర్‌ లీక్‌ అవుతుందోనని బిక్కుబిక్కుమంటున్నది. దీని కోసం ఏకంగా...