సమంత ‘మా ఇంటి బంగారం’ ఫస్ట్ డే కలెక్షన్స్..
సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘మా ఇంటి బంగారం’ థియేటర్లలో సాలిడ్ ఓపెనింగ్ సాధించింది. ట్రేడ్ వర్గాల ప్రకారం ఈ చిత్రం తొలిరోజు భారతదేశంలో రూ.5.35 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తుంది. దీంతో ఇండియా గ్రాస్ కలెక్షన్ సుమారు రూ.6.20 కోట్లుగా నమోదుకాగా. దేశవ్యాప్తంగా 2,658 షోలలో ఈ సినిమా ప్రదర్శితమైంది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి మరో రూ.4.50 కోట్ల గ్రాస్ రావడంతో తొలిరోజు వరల్డ్‌వైడ్ గ్రాస్ కలెక్షన్ రూ.10.70 కోట్లకు చేరింది.రిజియన్ వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి రూ.4.75 కోట్ల గ్రాస్‌తో టాప్‌లో నిలిచాయి. కర్ణాటకలో రూ.90 లక్షలు, తమిళనాడులో రూ.38 లక్షల గ్రాస్...