హైతీ ఆశ‌లు ఆవిరి.. 3-0 గోల్స్ తేడాతో బ్రెజిల్ విక్ట‌రీ

ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో జ‌రిగిన గ్రూప్ సీ మ్యాచ్‌లో.. బ్రెజిల్ జ‌ట్టు విజ‌యం సాధించింది. 3-0 గోల్స్ తేడాతో హైతీపై విక్ట‌రీ కొట్టింది. బ్రెజిల్ ప్లేయ‌ర్ మాథ్యూస్ కున్హా రెండు గోల్స్ చేశాడు. మొరాకోతో జ‌రిగిన‌ ఓపెనింగ్ మ్యాచ్‌లో బ్రెజిల్‌పై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఆ మ్యాచ్ డ్రా కావ‌డంతో ప్లేయ‌ర్లు స‌రిగా ప‌ర్ఫార్మ్ చేయ‌లేద‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో హైతీతో జ‌రిగిన మ్యాచ్‌లో బ్రెజిల్ ఆట‌గాళ్లు దూకుడు పెంచారు. ఆ జ‌ట్టులో వినిసియ‌స్ జూనియ‌ర్ మ‌రో గోల్ చేశాడు. స్ట్ర‌యిక‌ర్ ఇగోర్ థియాగో స్థానంలో ఆడిన కున్హా.. 23వ నిమిషంలోనే తొలి గోల్ చేశాడు. హైతీ డిఫెండ‌ర్ హ‌న్నెస్ డిల్‌క్రాక్స్‌కు బంతి త‌గిలి నెట్‌లోకి దూసుకెళ్లింది....