ప్రియుడితో ఏకాంతంగా ఉన్నప్పుడు ఏడుస్తున్నాడని..
సిద్దిపేట జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడితో ఏకాంతంగా గడిపేందుకు అడ్డొస్తున్నాడని రెండేళ్ల కొడుకునే ఓ కన్నతల్లి హత్యచేసింది. ఫిట్స్ వచ్చి చనిపోయాడని అందర్నీ నమ్మించింది. కానీ తండ్రికి అనుమానం రావడంతో 20 రోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం తీగుల్ గ్రామానికి చెందిన స్వామి క్యాబ్ డ్రైవర్. భార్య జ్యోతి, రెండేళ్ల కుమారుడు హరికృష్ణతో కలిసి కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో జ్యోతి నవీన్ అనే వ్యక్తితో అక్రర సంబంధం పెట్టుకుంది. భర్త లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలుచుకునేది. ఇలా వాళ్లిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో బాబు తరచూ ఏడుస్తుండటంతో...