‘పుష్ప’ సీన్ రీక్రియేట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లుకేమియాతో బాధపడుతున్న చిన్నారి శ్రద్ధ కోరికను తీర్చారు. మేక్-ఎ-విష్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఆమెను కలిసిన అల్లు అర్జున్, ‘పుష్ప’ సినిమాలోని పాపులర్ మూమెంట్స్‌ను ఆమెతో కలిసి రీక్రియేట్ చేశారు. ఈ హృదయాన్ని హత్తుకునే వీడియోను అల్లు అర్జున్ టీమ్ షేర్ చేయగా, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.వీడియోలో అల్లు అర్జున్ నవ్వుతూ హాయ్ శ్రద్ధా, ఎలా ఉన్నావ్? అని పలకరించారు. ఆ తర్వాత ‘పుష్ప’ సినిమాలోని ఐకానిక్ డైలాగ్ చెప్పమని ప్రోత్సహించారు. ఇద్దరూ కలిసి పుష్ప సిగ్నేచర్ బియర్డ్ స్ట్రోక్ చేయగా, అల్లు అర్జున్ చప్పట్లు కొడుతూ “డ్యామ్ క్యూట్” అని మెచ్చుకున్నారు. చివరగా నువ్వు...