మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన చేనేత కార్మికులు

వరంగల్, జూన్ 20 (సుదీక్ష న్యూస్): చేనేత కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు టెస్కో ద్వారా నేత కూలీలను 30 శాతం పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో చేనేత కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వరంగల్ నగరంలోని గోపాలస్వామి గుడి జంక్షన్ వద్ద ఉన్న ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఎదుట రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్ప వెంకటేశ్వర్లు నేత మాట్లాడుతూ, ఇటీవల చేనేత కార్మికుల నిరసన దీక్ష శిబిరాన్ని మంత్రి సందర్శించిన సందర్భంగా కార్మికులు చేసిన ప్రధాన...