స్ప్రింగ్ వ్యాలీ గ్లోబల్ స్కూల్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
జనగాం, జూన్ 21 (సుదీక్ష న్యూస్): స్థానిక స్ప్రింగ్ వ్యాలీ గ్లోబల్ స్కూల్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల చైర్మన్ నలుసాని తిరుపతి రెడ్డి, ప్రిన్సిపాల్ రావుల ఉపేందర్ బాబు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయుల పర్యవేక్షణలో వివిధ యోగాసనాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రావుల ఉపేందర్ బాబు మాట్లాడుతూ యోగా మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. భారతదేశంలో పుట్టిన యోగా నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం...