*కాకతీయ కోటలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం*

12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 ను పురస్కరించుకుని చారిత్రక ఖిలా వరంగల్ ప్రాంగణంలో ఆదివారం ఘనంగా యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు.కాకతీయుల వైభవానికి ప్రతీకగా నిలిచిన ఈ చారిత్రక ప్రాంగణంలో జరిగిన కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.సుమారు 500 మంది విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొని యోగాసనాలు వేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద,కూడా చైర్మన్ ఏనుగాల వెంకటరామిరెడ్డి గార్లు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన జీవన విధానమని పేర్కొన్నారు. నేటి వేగవంతమైన జీవనశైలిలో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా ఎంతో అవసరమని అన్నారు. ప్రతిరోజూ యోగా సాధన...