తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్‌కు ఘన నివాళులు
హనుమకొండ, జూన్ 21 (సుదీక్ష న్యూస్): తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి వర్ధంతిని పురస్కరించుకుని హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిలా పార్కులో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి పూలమాల వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ బస్వరాజు సారయ్య, తెలుగు అకాడమీ చైర్మన్ శ్రీ కూరపాటి వెంకటనారాయణ, యువ నాయకులు శ్రీ విష్ణు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ జీవితాంతం అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. ప్రాంతం, వర్గం, కులం, మత భేదాలకు అతీతంగా...