పెరిగిన బంగారం, వెండి ధరలు- జూన్​ 22న తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

దేశీయ మార్కెట్​లో సోమవారం బంగారం ధరలు మరోసారి స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో జరుగుతున్న పరిణామాలు, డిమాండ్‌ పెరుగుదలతో పాటు పెట్టుబడిదారుల ఆసక్తి కారణంగా పసిడి ధరలు పెరుగుతున్నాయి. అదే సమయంలో వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. క్యాప్స్‌ గోల్డ్‌ వెబ్‌సైట్‌ వివరాల ప్రకారం, సోమవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,50,270గా నమోదైంది. గత ట్రేడింగ్‌ సెషన్‌లో ఈ ధర రూ.1,49,600గా ఉండగా, ఒక్కరోజులోనే రూ.670 మేర పెరుగుదల కనిపించింది. హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు, ముంబయి, బెంగళూరు మార్కెట్లలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. నగల తయారీలో విస్తృతంగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం...