వాహనాల తనిఖీ సమయంలో దూసుకొచ్చిన లారీ - భూపాలపల్లి డీటీవో మృతి

వాహనాల తనిఖీ సమయంలో లారీ ఢీకొని డీటీవో మృతి చెందారు. భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు శివారులో ఆర్టీవో కార్యాలయం ముందు వాహనాల తనిఖీలు చేస్తున్నారు. ఇదే సమయంలో అతివేగంతో అదుపుతప్పిన ఓ బొగ్గు లారీ డీటీవో వెంకన్నపైకి దూసుకొచ్చింది. నడుము పైనుంచి లారీ వెళ్లడంతో వెంకన్న అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని భూపాలపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వెంకన్న కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది : భూపాలపల్లి రోడ్డు ప్రమాదంలో డీటీవో వెంకన్న మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల సంతాపం...