చిటికెడు వాముతో ఎన్నో లాభాలు - శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

జీవనశైలి, ఆహారపు అలవాట్లు, విపరీతమైన ఒత్తిడి కారణంగా చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ఎసిడిటీ ఒకటి. అయితే, గిన్నెలో ఒక గ్లాసు నీళ్లు పోసి అందులో ఒక టీస్పూన్ వాము, ఒక టీస్పూన్ జీలకర్ర వేసి బాగా మరిగించాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఎసిడిటీతో బాధపడుతున్నప్పుడు ఈ మిశ్రమాన్ని తాగితే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. బాలింతలకు మేలు : గర్భం దాల్చిన మహిళలకు, పాలిచ్చే తల్లులకు వాము చాలా మంచిదంటున్నారు నిపుణులు. గర్భిణులకు సాధారణంగా ఎదురయ్యే మలబద్ధకం, అజీర్తిని ఇది దూరం చేస్తుందంటున్నారు. అలాగే, బాలింతల్లో పాల ఉత్పత్తిని పెంచుతుందని పేర్కొంటున్నారు. రాత్రిపూట ఈ ఆహారం తింటున్నారా? - ఆరోగ్యం...