అది ఫేక్ వీడియో- నీట్ రీ ఎగ్జామ్‌ను విజయవంతంగా నిర్వహించాం : పేపర్ లీక్ ఆరోపణలపై NTA క్లారిటీ

దేశవ్యాప్తంగా ఆదివారం జరిగిన నీట్ యూజీ రీ-టెస్ట్ ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందని సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వీడియో నకిలీదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తెలిపింది. నీట్ యూజీ పరీక్షను కట్టుదిట్టమైన భద్రత, నిఘా మధ్య విజయవంతంగా నిర్వహించామని పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు, ఈ వీడియో ఫేక్‌ అని కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది. నీట్ యూజీ పేపర్ లీక్ ఆరోపణలు నిరాధారమైనవని, అసత్యమైనవని ప్రభుత్వ అధికారిక నిజ నిర్ధరణ విభాగమైన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) స్పష్టం చేసింది. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం : ఎన్‌టీఏ నీట్ యూజీ- 2026 రీ ఎగ్జామ్​కు సంబంధించి సోషల్...