'షీర్వాల్' పద్ధతిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం - రెండో విడతలో పూరిళ్లకే అధిక ప్రాధాన్యం
ప్రతి మధ్యతరగతి, పేద కుటుంబాలకు సొంత ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా వారంతా పక్కా ఇళ్లు నిర్మించుకునేందుకు సహాయపడుతోంది. దీంట్లో భాగంగానే మొదట విడత ఇళ్ల మంజూరు చేశారు. దానికి అనుగుణంగా విడతల వారిగా నిధులను కేటాయిస్తున్నారు. ప్రస్తుతం రెండో విడత ఇళ్ల మంజూరుకు ప్రభుత్వం సిద్ధమైతుంది. దీంట్లో ప్రధానంగా గుడిసెలలో నివసించేవారినే లక్ష్యంగా తీసుకోనుంది. అలాగే వీరికి 'షీర్వాల్' టెక్నాలజీ పద్ధతిలో ఇంటి నిర్మాణాన్ని చేపట్టేందుకు ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 24వేల పూరిళ్లు : ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించారు. ఆ క్రమంలో పూరిళ్లలో...