ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా సంక్షోభం – రైతులకు మరణశాసనం రాసిన కాంగ్రెస్ ప్రభుత్వం: కేటీఆర్
వర్ధన్నపేట, వరంగల్ జిల్లా సుదీక్ష న్యూస్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి మార్గం నుంచి సంక్షోభాల బాట పట్టిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, పంటల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని అన్నారు. గతంలో ప్రతి గింజను కొనాలని డిమాండ్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పినంత మేరకే ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పడం రైతాంగాన్ని మోసం చేయడమేనని...