మరోసారి నాకౌట్‌లోకి ఫ్రాన్స్- ఎంబాపె రికార్డ్ గోల్స్- ఇరాక్‌పై 3-0తో విజయం
ఫిఫా ప్రపంచకప్‌లో రెండు సార్లు ఛాంపియన్ అయిన ఫ్రాన్స్ మళ్లీ కప్పు కొట్టేందుకు దూసుకెళ్తోంది. స్టార్ ఆటగాడు కిలియన్ ఎంబాపె మరోసారి డబుల్ గోల్స్‌తో మెరవడంతో ఇరాక్‌పై ఈ జట్టు 3-0తో విజయం సాధించింది. ఫలితంగా నాకౌట్‌లోకి అడుగుపెట్టింది. ఫ్రాన్స్ తరఫున ఔస్‌మనె డెంబెలె మరో గోల్ చేశాడు. అటు 27 ఏళ్ల ఎంబాపెకుఇది 100వ అంతర్జాతీయ మ్యాచ్. వర్షం కారణంగా ఆలస్యంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఎంబాపె 14, 54వ నిమిషాల వద్ద రెండు గోల్స్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ క్రమంలోనే సరికొత్త ఘనత సాధించాడు. మూడోసారి ఫిఫా వరల్డ్‌కప్ ఆడుతున్న ఎంబాపె ఈ టోర్నీలో అత్యధిక గోల్స్ చేసిన రెండో...