మెట్రోపై కేంద్రమంత్రులతో చర్చలు ఫలప్రదం - ఫేజ్-1 వాల్యుయేషన్, ఫేజ్-2 విస్తరణకు కన్సల్టెంట్ నియామకం
హైదరాబాద్ మెట్రో రైలు స్వాధీనం, విస్తరణపై కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం ఖట్టర్ నివాసంలో ఈ అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్- I వాల్యుయేషన్, ఫేజ్-I స్వాధీనానికి అవసరమైన రుణ సేకరణ, మెట్రో ఫేజ్-II విస్తరణకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్‌ను నియమించాలని కేంద్రమంత్రులు, సీఎం ఏకాభిప్రాయానికి వచ్చారు. కన్సల్టెంట్‌గా ఎస్బీఐ క్యాప్స్‌ను ఎంపిక చేశారు. కన్సల్టెంట్ నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ :...