పేదల ఓట్లు పోతే వాళ్ల ఆధార్ కార్డు, రేషన్ కార్డు పోతుంది : సీఎం రేవంత్ రెడ్డి
ఎస్ఐఆర్ (ఓటరు జాబితా సవరణ ప్రత్యేక సవరణ కార్యక్రమం) ప్రక్రియ చాలా సీరియస్ అంశమని, అందరూ మరింత అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నాయకులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఓటర్ల ప్రత్యేక జాబితా సవరణ విషయంలో సరిగా వ్యవహరించకపోతే పేదలకు అన్యాయం జరుగుతుందని, వారి ఓట్లు పోతే ఆధార్, రేషన్ కార్డు పోతుందన్నారు. తెలంగాణలో రేపటి నుంచి ఎస్ఐఆర్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నిర్వహించిన జూమ్ మీటింగ్లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తదితరులు పాల్గొన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్షమించే ప్రసక్తే లేదు :...