'మత్తుబాబులు మాకొద్దు బాబోయ్' అంటున్న ఆడపిల్లల తల్లిదండ్రులు - పెళ్లి విషయంలో ఆచితూచి అడుగులు

మత్తులోనే హాయి ఉందంటూ కొంత మంది యువత గంజాయి మత్తులో తేలిపోతున్నారు. పలు కారణాలతో డ్రగ్స్​కు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇటీవల ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఈ కారణంగా ఆడపిల్లల తండ్రులు వరుడిని వెతికే సమయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. పొరపాటున డ్రగ్స్​ బాధితుడితో పెళ్లి చేస్తే, తన కుమార్తె జీవితాన్ని చేజేతులా నాశనం చేసినట్టు అవుతుందని భావిస్తున్నారు. ఈ సమస్య ఆడపిల్లల తండ్రులతో పాటు అబ్బాయి తండ్రులకు కూడా ఉంది. కొడుకు మత్తుకు బానిసై బంగారు భవిష్యత్తును బలి చేసుకుంటున్నాడని కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణలు ఇవే! : హైదరాబాద్​లోని కేబీహెచ్​బీ కాలనీలో ఓ కుటుంబం నివసిస్తోంది. కొద్దిరోజుల...