ఏఐఎఫ్‌డీఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ

సుదీక్ష న్యూస్, కాట్రపల్లి: అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య (AIFDS) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున స్వగ్రామమైన కాట్రపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో గురువారం 150 నోట్‌బుక్స్, 20 పెన్నులను విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గడ్డం నాగార్జున మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత ప్రీ-ప్రైమరీ విద్యను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. కొద్ది పాఠశాలలకే పరిమితం కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఈ సదుపాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, నాన్-టీచింగ్ సిబ్బంది, డీఈఓ, ఎంఈఓ...