పారదర్శక ఓటర్ల జాబితా రూపకల్పనకు అందరి సహకారం అవసరం: కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి

హనుమకొండ, జూన్ 24 (సుదీక్ష న్యూస్): ఓటరు జాబితాను మరింత ప్రామాణికంగా, పారదర్శకంగా రూపొందించేందుకు చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్-2026) కార్యక్రమానికి ప్రజలతో పాటు మీడియా ప్రతినిధులు కూడా సహకరించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన మీడియా అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్‌ఐఆర్-2026 అమలు విధానం, ఎన్యుమరేషన్ ప్రక్రియ, ఓటర్ల బాధ్యతలపై అధికారులతో కలిసి వివరాలు వెల్లడించారు. ప్రజలకు సరైన సమాచారం చేరవేయడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని, ఓటర్లలో ఉన్న అపోహలను తొలగించి అవగాహన పెంపొందించేందుకు సహకరించాలని కోరారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు హౌస్-టు-హౌస్ ఎన్యుమరేషన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు...