రూ.1.50 కోట్లతో మంగపేట ఎంపీపీ కార్యాలయ భవనానికి మంత్రి సీతక్క శంకుస్థాపన

ములుగు, సుదీక్ష న్యూస్: మంగపేట మండల కేంద్రంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ) కార్యాలయ భవన నిర్మాణ పనులకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క గురువారం జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు మెరుగైన పరిపాలనా సేవలు అందించేలా ఆధునిక సౌకర్యాలతో కార్యాలయ భవనాన్ని నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో లెనిన్...