మత్తు పదార్థాల నిర్మూలనకు సమష్టిగా కృషి చేయాలి
అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీలో కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి హనుమకొండ, సుదీక్ష న్యూస్: మత్తు పదార్థాల వినియోగం సమాజానికి పెను సవాలుగా మారిందని, వాటి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం జిల్లా పరిపాలన ఆధ్వర్యంలో హనుమకొండలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. హనుమకొండ ఆదాలత్ సర్కిల్ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో, ముఖ్యంగా యువతలో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం...