జూన్ 29న వరంగల్‌లో ఎంసిపీఐ(యు) రాష్ట్ర ఏకీకరణ నిర్మాణ సదస్సు

వరంగల్, జూన్ 25 (సుదీక్ష న్యూస్): కమ్యూనిస్టు ఉద్యమ బలోపేతం, పార్టీ ఏకీకరణ లక్ష్యంగా ఎంసిపీఐ(యు) రాష్ట్ర ఏకీకరణ నిర్మాణ సదస్సును ఈ నెల 29న వరంగల్ నగరంలోని అల్పాహారం కన్వెన్షన్ హాల్‌లో నిర్వహిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి తెలిపారు. వరంగల్‌లోని ఓంకార్ భవన్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్టీలో తలెత్తిన అంతర్గత విభేదాలను అధిగమించి ఐక్యంగా ముందుకు సాగే దిశగా కృషి చేస్తున్నామని చెప్పారు. కమ్యూనిస్టు పార్టీల ఐక్యత కోసం ఇతర వామపక్ష పార్టీలతో కూడా చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. దేశంలో పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాద శక్తుల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో కమ్యూనిస్టు శక్తులు ఐక్యంగా ప్రజా ఉద్యమాలను...