కారులో దారుణ ఘటన..
మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్‌లో యువతి, యువకుడి మృతదేహాలు లభ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఓ నిర్మానుష్య ప్రదేశంలో పార్క్ చేసిన కారులో ఇద్దరి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. యువకుడి తలకు బుల్లెట్, ముఖంపై కాలిన గాయాలు కనిపించాయి. మరోవైపు యువతి గొంతు కోసి అత్యంత దారుణంగా హత్య చేసినట్లు కనిపిస్తోంది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వారిని రితిక్ సోని, ముస్కాన్‌గా పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా కారులో మారణాయుధాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం పోలీసులు మాట్లాడుతూ.. బుధవారం మధ్యాహ్నం జిమ్ చేసేందుకు ముస్కాన్ ఇంటి నుంచి వెళ్లిపోయిందని తెలిపారు. రాత్రి అయినా ఆమె...