తుది జట్టులోకి సూర్యవంశీ ఎంట్రీపై బ్యాటింగ్ కోచ్ కీలక వ్యాఖ్యలు..
టీమిండియాలో ప్రస్తుతం కుర్రాళ్ల హవా నడుస్తోంది. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లు తమ దూకుడైన ఆటతీరుతో ఇప్పటికే జట్టుకు కొత్త ఊపు తీసుకువచ్చారు. తాజాగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఎంపిక క్రికెట్ అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించింది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026లో ప్రపంచస్థాయి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అలానే ఐపీఎల్ 2026లో ఏకంగా 776 పరుగులతో 'ఆరెంజ్ క్యాప్' కైవసం చేసుకున్న సూర్యవంశీ రికార్డు సృష్టించాడు. ఈ నేపథ్యంలో ఐర్లాండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌లో అతడిని బరిలోకి దించాలని అభిమానుల నుంచి గట్టి డిమాండ్ వినిపిస్తోంది. అయితే, బెల్‌ఫాస్ట్‌లో తొలి మ్యాచ్‌కు ముందు టీమిండియా మేనేజ్‌మెంట్ సూర్యవంశీ ఎంట్రీపై స్పష్టమైన సంకేతాలిచ్చింది....