విజయ్ దేవరకొండపై తప్పుడు ప్రచారం..
నటుడు విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ చుట్టూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పుకార్లను చిత్ర యూనిట్ తీవ్రంగా ఖండించింది. షూటింగ్ సెట్స్‌లో విజయ్ దేవరకొండ తన కోసం 5 నుంచి 6 కారవాన్లు, 40-50 మంది అసిస్టెంట్లను డిమాండ్ చేశారని, దీనిపై నిర్మాతలు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌ను ఆశ్రయించారంటూ కొన్ని నకిలీ స్క్రీన్‌షాట్లు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ తప్పుడు ప్రచారంపై చిత్ర నిర్మాత, మైత్రీ మూవీ మేకర్స్ అధినేత వై. రవిశంకర్ స్పందించారు. విజయ్ దేవరకొండ చాలా ప్రొఫెషనల్‌గా వ్యవహరిస్తారని, షూటింగ్‌లో ఇప్పటివరకు ఎలాంటి సమస్యలు తలెత్తలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ వార్తలన్నీ...