నీట్ పేపర్ లీక్‌పై కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన

మోదీ దిష్టిబొమ్మ దహనం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ వరంగల్, జూన్ 27 (సుదీక్ష న్యూస్): రాహుల్ గాంధీ పిలుపు మేరకు వరంగల్ పోచమ్మ మైదాన్ సెంటర్‌లో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ, జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో “ఛాత్రోంకి గూంజ్” కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశంలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ వరుసగా పరీక్షల్లో పేపర్ లీక్‌లు జరుగుతున్నాయని ఆరోపిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారాన్ని నిరసిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని వరంగల్ జిల్లా...