పేదల ఇళ్ల కూల్చివేతపై వామపక్షాల భారీ నిరసన

ఎమ్మెల్యే కూనంనేని సహా పలువురు నేతల అరెస్టు హనుమకొండ, సుదీక్ష న్యూస్: హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో పేదల గుడిసెల కూల్చివేతలను నిరసిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో శనివారం హనుమకొండలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఏకశిలా పార్కు నుంచి కలెక్టరేట్ వరకు వేలాది మంది పాల్గొన్న ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీసింది. అమరవీరుల స్థూపం వద్ద రోడ్డుపై బైఠాయించిన సందర్భంగా పోలీసులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీతో పాటు పలువురు నాయకులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, వామపక్ష కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకోగా, అరెస్టులను నిరసిస్తూ కార్యకర్తలు రాస్తారోకో చేపట్టారు. పేదలకు ఇళ్ల స్థలాల...