సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే కంచ‌ర్ల భూపాల్‌రెడ్డి బహిరంగ లేఖ

రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి రేపు నల్లగొండ ప‌ర్య‌ట‌న‌కు వస్తున్న నేపథ్యంలో నల్లగొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ న‌ల్ల‌గొండ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి కంచర్ల భూపాల్ రెడ్డి బ‌హిరంగ లేఖ రాశారు. లేఖ సారంశం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు నల్లగొండకు రావడం ఆహ్వానించతగ్గ పరిణామమే. అయితే సీఎం తమ ప్రాంతానికి వస్తున్నారంటే సహజంగానే ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రజల్లో ఆకాంక్షలు, ఆశలు, కోరికలు ఉంటాయి. మీ రెండున్నర ఏండ్ల పాలన కాలంలో ఇది రెండోసారి మీరు నల్లగొండ పర్యటనకు రావడం. కానీ నేటికీ ఈ నల్లగొండ నియోజకవర్గ ప్రజల సమస్యలు ఎక్కడ ఉన్నవి అక్కడే ఉన్నాయి. ఇక్కడి నుండి ప్రాతినిద్యం వహిస్తున్న రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ...