అమరావతి రైతుల పేరుతో వైసీపీ మరో కొత్త డ్రామా ఆడుతోంది
అమరావతి రైతుల పేరుతో వైసీపీ మరోసారి రాజకీయ డ్రామాకు తెరలేపిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. రైతుల మనోభావాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం వైసీపీకి అలవాటేనని ఆరోపించారు. అమరావతిని నిర్వీర్యం చేసిన వారే ఇప్పుడు రైతుల పరిరక్షణ పేరుతో మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. అమరావతి రైతుల సంక్షేమంపై చిత్తశుద్ధిలేని వైసీపీ నేతలు.. ప్రజలను రెచ్చగొట్టి, ఆ తర్వాత బాధితులమని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడం వైసీపీ రాజకీయ శైలిగా మారిందని ఆయన అన్నారు రాజధాని అభివృద్ధిని అడ్డుకున్న పార్టీ ఇప్పుడు అదే ప్రాంతంలో రైతుల పక్షాన నిలుస్తున్నట్లు నటించడం ప్రజలను...