ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసు..

ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసుపై దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఐఏ మరో ముగ్గురు నిందితులపై అనుబంధ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో ఈ సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ప్రస్తుతం పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు ముజఫర్‌ అహ్మద్ అలియాస్ ఫరాజ్ అలియాస్ జఫర్‌తో పాటు జమీర్ అహ్మద్ అహాంగర్, తుఫెయిల్ అహ్మద్ భట్‌ పేర్లను చార్జ్‌ షీట్‌లో పేర్కొంది. నిందితులు ముగ్గురూ జమ్మూకశ్మీర్‌కు చెందిన వారని ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. తాజా చార్జ్‌షీట్‌తో ఈ కేసులో మొత్తం నిందితుల సంఖ్య 13కు పెరిగింది. పరారీలో ఉన్న ముజఫర్ అహ్మద్ పిడియాట్రీషియన్ అని ఎన్ఐఏ పేర్కొంది. అతడు ఎండీ కూడా చేశాడని...