కుర్చీ కోసం ఆరాటం వైసీపీది.. ప్రజాసేవ కోసం పోరాటం పవన్ కల్యాణ్‌ది.
కుర్చీ కోసం ఆరాటం వైసీపీది అయితే.. ప్రజాసేవ కోసం పోరాటం పవన్ కళ్యాణ్‌ది అని అన్నారు ఏపీ పర్యాటక, సినీ ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్. పవన్ కల్యాణ్ రాజకీయ ఎదుగుదలను చూసి వైసీపీలోని కాపు నేతలు జీర్ణించుకోలేక వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి నిలిచిన నాయకుడు పవన్ కల్యాణ్ అని దుర్గేశ్ పేర్కొన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తూ ఆయన తీసుకున్న నిర్ణయాల వల్లే నేడు కూటమి ప్రభుత్వం ఏర్పడి రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తోందన్నారు. పవన్ వ్యక్తిత్వాన్ని, ఆయన రాజకీయ విజన్‌ను అర్థం చేసుకునే స్థాయి వైసీపీ నాయకులకు లేదని, అందుకు...