ప‌శ్చిమాసియాలో క‌మ్ముకున్న‌ యుద్ధ జ్వాల‌లు..

పశ్చిమాసియా (West Asia) లో యుద్ధ జ్వాలలు మరింత తీవ్రరూపం దాల్చాయి. తమ భూభాగంపై అమెరికా (USA) జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా ఇరాన్‌ (Iran) కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సంచలన చర్యకు దిగింది. కువైట్ (Kuwait), బహ్రెయిన్ (Bahrain) దేశాలలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ బలగాలు ఆదివారం క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. ఈ ఆకస్మిక పరిణామంతో ఆ ప్రాంతంలో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా పక్కకుపోయి, ఉభయ దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధం మొదలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. హర్మూజ్ జలసంధి సమీపంలో ఉన్న తమ క్షిపణి కేంద్రాలు, డ్రోన్ గిడ్డంగులు,...