పుప్పాలగుట్టలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పర్యవేక్షించిన బూరుగుపల్లి విజయ్ కుమార్

నేడు పోలియో కార్యక్రమం సందర్భంగా హనుమకొండలోని పుప్పాలగుట్ట 35వ డివిజన్‌లో ఏర్పాటు చేసిన పోలియో బూత్‌ను సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు, ఉద్యమకారుడు బూరుగుపల్లి విజయ్ కుమార్ సందర్శించి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేయిస్తున్న తీరును పరిశీలించి, ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. ప్రజారోగ్య పరిరక్షణలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.