పూటకో పార్టీ పేరు మార్చుకునే మీరు మమ్మల్ని విమర్శిస్తారా
జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.. బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి, గత పాలనలో జరిగిన అవినీతి, ప్రస్తుత ప్రాజెక్టుల పురోగతి వంటి అంశాలపై కోమటిరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బయటికి వెళ్లిన ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇంటికి తిరిగి రావాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 13 వేల కోట్ల రూపాయలతో హ్యామ్ రోడ్లను నిర్మిస్తోందని ఆయన తెలిపారు. అభివృద్ధి పనులను ఉద్దేశించి విమర్శలు చేసే వారిపై ఆయన విమర్శలు గుప్పించారు. పచ్చ కామెర్లు ఉన్న వారికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుందని వ్యాఖ్యానిస్తూ ప్రతిపక్షాలపై వ్యంగ్యాస్త్రాలు...