కుప్పకూలిన హెలికాప్టర్.
సౌదీ అరేబియాలోని రాస్ తనూరాలో హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. సౌదీ ప్రెస్ ఎజెన్సీ తెలిపిన వివరాల మేరకు.. సౌదీ అరేబియాలోని ప్రముఖ ఆయిల్ కంపెనీ అరామ్‌కోకు చెందిన హెలికాప్టర్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6 గంటల ప్రాంతంలో రాస్ తనూరా వద్ద కుప్పకూలింది. దీంతో హెలికాప్టర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు మొదలెట్టారు. అయితే, ప్రమాదం కారణంగా అందులో ప్రయాణిస్తున్న 14 మంది చనిపోయారు. ఈ విషయాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ ధ్రువీకరించింది. చనిపోయిన వారంతా సౌదీకి చెందిన...